ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి: తులసి రెడ్డి - tulasi reddy on kadapa murder case

కడప జిల్లా పొద్దుటూరులో నిన్న హత్యకు గురైన తెదేపా నేత నందం సుబ్బయ్య మృత దేహానికి తులసి రెడ్డి నివాళులర్పించారు. అవినీతిని ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్యను హత్య చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tulasi reddy fires on prodhutur murder
తులసి రెడ్డి

By

Published : Dec 30, 2020, 2:22 PM IST

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి ఆరోపించారు. కడప జిల్లా పొద్దుటూరులో నిన్న హత్యకు గురైన తెదేపా నేత నందం సుబ్బయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుబ్బయ్య కుటుంబ సభ్యులను తులసి రెడ్డి పరామర్శించారు. వైకాపా పాలనలో ధన మాన ప్రాణాలకు రక్షణ కరవైందని ఆరోపించారు. నాలుగైదు మాసాల్లో కడప జిల్లాలో అనేక మంది హత్యకు గురయ్యారని అన్నారు. అవినీతిని ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్యను హత్య చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకు కారణమైనవారిని శిక్షించాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details