కడప జిల్లా గండికోట ముంపు గ్రామాల ప్రజలను రక్షించాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సొంత జిల్లాపై జగన్కు ఎందుకింత చులకన భావం అని ప్రశ్నించాారు. ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించకుండా, పునరావాసం చూపకుండా… ఇళ్లు ఖాళీ చేసి పోమ్మంటే… ఎక్కడికి వెళ్తారని నిలదీశారు.
జేసీబీలతో ఇళ్లు కూల్చేస్తామని బెదిరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం 30 గ్రామాల ప్రజలకు ఇస్తున్నట్టే… వీరికి కూడా రూ.12.50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు.