వైకాపా ప్రభుత్వం మద్యం ధరలు పెంచి... మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకుంటుందని... రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. పులి నెత్తురుకు రుచి మరిగినట్లు...సీఎం జగన్ ఎక్సైజ్ ఆదాయానికి రుచి మరిగారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యం ధరలు పెంచటం ద్వారా మందుబాబులు... వారి భార్యల తాళిబొట్లను కూడా అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'సీఎం జగన్ ఎక్సైజ్ ఆదాయానికి రుచి మరిగారు' - మద్యం ధరలపై తులసిరెడ్డి వ్యాఖ్యలు
ప్రభుత్వం మద్యం ధరలు పెంచటంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. మద్యం ధరలు పెంచి పేదల బలహీనతను వైకాపా ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందని ఆరోపించారు.

'పులి నెత్తురుకు రుచి మరిగినట్లు..జగన్ ఎక్సైజ్ ఆదాయానికి రుచి మరిగారు'
పెంచిన మద్యం ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుండా పెంచిన ధరలకు జగనన్న పూసలు తెంచే పథకమని పేరు పెట్టుకోవాలని ధ్వజమెత్తారు.