ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల పాలిట కంస మామ, శకుని మామలా తయారయ్యాడని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి విమర్శించారు. 3,4,5 తరగతులను ఎలిమెంటరీ పాఠశాలల నుంచి విడగొట్టి హైస్కూల్లో కలపటం పిచ్చి తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. పాఠశాల విద్యలో తెలుగు మీడియం రద్దు చేయటం చారిత్రిక తప్పిదమనన్నారు. పీజీ విద్యనభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన లేకుండా చేస్తూ జారీ చేసిన జీవో నెంబరు 77 వారి పాలిట శాపంగా మారిందన్నారు. రాష్ట్రంలో విద్యా విధానం పట్ల సీఎం జగన్ వైఖరి చూస్తుంటే.. కుండకు బొక్క పెట్టి అందులో నీళ్లు పోసినట్లుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో 77ను రద్దు చేసి, విద్యా వ్యతిరేక విధానాలు మానుకోవాలని సూచించారు.
"విద్యార్థుల పాలిట శకుని మామ.. సీఎం జగన్" - తులసిరెడ్డి తాజా వార్తలు
రాష్ట్రంలో విద్యా విధానం పట్ల ముఖ్యమంత్రి జగన్ వైఖరి చూస్తుంటే.. కుండకు బొక్క పెట్టి అందులో నీళ్లు పోసినట్లుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల పాలిట కంస మామ, శకుని మామలా తయారయ్యాడని విమర్శించారు.
సీఎం జగన్ విద్యార్థుల పాలిట శకుని మామలా తయ్యారయ్యారు