లాక్‌డౌన్‌తో రైతులు, కూలీలు పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలన్న డిమాండ్‌తో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి దీక్ష చేస్తున్నారు. కడప జిల్లా వేంపల్లెలోని తన ఇంట్లో ఒక్కరోజు దీక్ష చెేపట్టారు. రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాలకు రూ. 5 వేలు నుంచి 10 వేలు ఆర్థిక సాయం చేయాలన్నారు. వారికి నిత్యావసరాలు ఇంటి వద్దకే పంపాలని సూచించారు. వలస కార్మికులను అన్ని జాగ్రత్తలు తీసుకొని వారి వారి ఇళ్లకు చేర్పించాలన్నారు. వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, విలేఖరులకు, పోలీసులకు కరోనా రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
'రైతులు, కూలీల సమస్యలు పరిష్కరించాలి'
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి తన ఇంట్లో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న రైతులు, పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు.
తులసి రెడ్డి దీక్ష