ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారిది అసమర్థ పాలన.. ఇవి అచ్ఛే దిన్ కాదు.. చచ్ఛే దిన్: తులసిరెడ్డి - భాజపాపై మండిపడ్డ తులసిరెడ్డి

భాజపా, వైకాపాలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో ఏపీ అప్పుల పాలయ్యిందని...మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తులసిరెడ్డి విమర్శించారు.

Tulasi Reddy
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి

By

Published : Mar 30, 2021, 5:36 PM IST

తిరుపతిలో కాంగ్రెస్ గెలుపు రాష్ట్ర ప్రగతికి మలుపు అని రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కడప జిల్లాలో వేంపల్లిలో అన్నారు. సంజీవని లాంటి ప్రత్యేక హోదా కాంగ్రెస్​తోనే సాధ్యం అని తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి భాజపా శని గ్రహంలా తయారయిందని.... వైకాపా, తెదేపాలు రాహు, కేతువులని ఆయన దుయ్యబట్టారు.

వైకాపా పాలనలో రాష్ట్రం అప్పుల పాలయిందని... రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు నింగిని అంటుతున్నాయని... అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలడం లేదని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టాయని... వంట గ్యాస్ పదో సెంచరీకి దగ్గరలో ఉందని అన్నారు. మోదీ, జగన్ అసమర్థ పాలన వల్ల అచ్చేదిన్ బదులు చచ్చేదిన్​లు వచ్చాయని, సబ్ వికాస్ బదులు సబ్ వినాష్ జరుగుతోందని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details