వైకాపా కూతలు, కోతలు, వాతల ప్రభుత్వమని కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని సీఎం మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. రేషన్, పింఛన్లలో కోతలు చాలదన్నట్లు త్వరలో విద్యుత్ కోతలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔరంగజేబు జుట్టు పన్ను విధిస్తే.. జగన్ చెత్త పన్ను విధించారని తులసిరెడ్డి దుయ్యబట్టారు.
Tulasi reddy: 'వైకాపా కూతలు, కోతలు, వాతల ప్రభుత్వం' - tulasi reddy comments on cm jagan
వైకాపా ప్రభుత్వంపై.. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని సీఎం మూడు రాజధానులెలా కడతారని ప్రశ్నించారు.
![Tulasi reddy: 'వైకాపా కూతలు, కోతలు, వాతల ప్రభుత్వం' Tulasi reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13333727-665-13333727-1634028963861.jpg)
Tulasi reddy