ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి భాజపా తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన భాజపా ప్రభుత్వం.. పుదుచ్చేరికి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ప్రత్యేక హోదా రావాలంటే తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
'ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం' - tulasi reddy comments on special status to ap
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా రావాలంటే తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.
tulasi reddy comments on special status to andhra pradesh