ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నైతిక విలువలుంటే సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి' - 'నైతిక విలువలుంటే సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి'

వైకాపా అరాచక పాలనకు కోర్టు తీర్పులే నిదర్శనమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. నైతిక విలువల పట్ల గౌరవముంటే జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.

'నైతిక విలువలుంటే సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి'
'నైతిక విలువలుంటే సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి'

By

Published : May 23, 2020, 9:34 PM IST

నైతిక విలువల పట్ల గౌరవముంటే జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా అరాచక పాలనకు కోర్టు తీర్పులే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయటం, వైద్యుడు సుధాకర్​ కేసును సీబీఐకి అప్పగించటం, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయటం ఇందుకు ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం రద్దులతోనే కాలం వెల్లదీస్తోందని దుయ్యబట్టారు. కోర్టులపై గౌరవం ఉంటే జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details