మండలి రద్దు నిర్ణయం సరికాదన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
'తీర్మానం చేస్తే మండలి రద్దు అయిపోదు' - కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి వార్తలు
శాసనమండలి రద్దు నిర్ణయం జగన్ అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఇల్లు అలకగానే పండగ కాదని... కేబినెట్‌లో తీర్మానం చేసినంత మాత్రాన మండలి రద్దు అయిపోదని చెప్పారు. కౌన్సిల్ రద్దుకు సీఎం చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని తులసిరెడ్డి స్పష్టం చేశారు.
!['తీర్మానం చేస్తే మండలి రద్దు అయిపోదు' tulasi-reddy-comments-on-council](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5857480-thumbnail-3x2-tulasi.jpg)
tulasi-reddy-comments-on-council
.