కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామ సమీపంలోని ప్రాచీన శైవక్షేత్రం భానుకోట సోమలింగేశ్వర ఆలయ జీర్ణోద్ధరణకు తితిదే ఈవో జవహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ చర్యపై తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి హర్షం వ్యక్తం చేశారు.
క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు స్థానికంగా ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. భానుకోట - మంగపట్నం మధ్య రోడ్డు లింక్ చేయాలని తితిదే ఈవో జవహర్‌రెడ్డిని బీటెక్ రవి కోరారు.