ONTIMITTA TEMPLE EO: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవానికి రావాలని సీఎం జగన్ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. తితిదే ఈవో డాక్టర్ కేఎస్.జవహర్ రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్ రమణ ప్రసాద్ ఆహ్వాన పత్రికను అందించారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదాలు అందజేశారు. ఈ నెల 15న రాత్రి 8 గంటలకు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఒంటిమిట్టలో రేపట్నుంచి 10 రోజులపాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
రేపట్నుంచి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు.. సీఎంకు ఆహ్వానం - రేపట్నుంచి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు
ONTIMITTA TEMPLE EO: ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి జగన్ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. తితిదే ఈవో, ఒంటిమిట్ట డిప్యూటీ ఈవో.. సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు.
![రేపట్నుంచి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు.. సీఎంకు ఆహ్వానం TTD EO AND ONTIMITTA TEMPLE EO MEET CM JAGAN](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14966161-1075-14966161-1649426250323.jpg)
సీఎంకు ఆహ్వాన పత్రిక అందించిన తితిదే ఈవో, ఒంటిమిట్ట డిప్యూటీ ఈవో