కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి.. డీఎస్పీపై చేసిన వ్యాఖ్యలకు తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. మైదుకూరులో ఎన్నికల సందర్భంగా ప్రొద్దుటూరు డీఎస్పీకి 30 లక్షల రూపాయలు లంచంగా తాను ఇవ్వలేదని తెలిపారు. ఒకవేళ తాను ఇచ్చినట్టు వరదరాజులరెడ్డి నిరూపించాలని లేనిపక్షంలో ఆయనపై న్యాయపోరాటం చేస్తానని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో నిజాయితీగా పని చేసిన పోలీసు అధికారులను అభినందించాల్సింది పోయి తిరిగి వారిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. వారి మనోధైర్యాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేస్తే తాము ఊరుకోమని పుట్టా హెచ్చరించారు.
వరదరాజులరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన తితిదే చైర్మన్ - తితిదే చైర్మన్
డీఎస్పీకి లంచం ఇచ్చానని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి చేసిన వ్యాఖ్యలపై తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆగ్రహించారు. తనపై ఆరోపించిన వాటిని వరదరాజులు నిరూపించకపోతే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.
వరదరాజులరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన తితిదే చైర్మన్
ఇవి కూడా చదవండి: