ap corona cases today: రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 39,296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10,310 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 1,697 కరోనా కేసులు నమోదు కాగా కర్నూలులో 1,379, కృష్ణా జిల్లాలో 1,008 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా నుంచి నిన్న 9,692 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,16,031 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా మరో 12 మంది కొవిడ్ బారినపడి మరణించినట్లు తెలిపారు.
దేశంలో సైతం తగ్గిన కేసులు...
Corona cases in India: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో.. 2,34,281 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. మరణాల సంఖ్య పెరిగింది. వైరస్‌తో మరో 893 మంది మరణించారు. 3,52,784 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:4,10,92,522
- మొత్తం మరణాలు: 4,94,091
- యాక్టివ్ కేసులు:18,84,937
- మొత్తం కోలుకున్నవారు:3,87,13,494
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 62,22,682 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,65,70,60,692కు చేరింది. దేశంలోని అర్హులైన వారిలో ఇప్పటివరకు 75శాతం మందికి రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అంతర్జాతీయంగా..
Corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 26,53,676 మందికి కరోనా సోకింది. 7,671 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 3,72,924,584కు చేరగా.. మరణాల సంఖ్య 56,75,413కుపెరిగింది.
ఇదీ చదవండి:New Virus India: నియోకొవ్ వైరస్‌తో భారత్‌కు ముప్పు ఉందా?