కడప జిల్లా రాయచోటిలో వారం రోజులుగా బిహార్, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు రెవెన్యూ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన కార్మికులను ఆరు ప్రత్యేక బస్సుల ద్వారా కడప రైల్వే స్టేషన్ తరలించారు. బిహార్, రాజస్థాన్, ఝార్ఖండ్ ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను కడప రైల్వే స్టేషన్‌కు తరలిస్తారని సమాచారంతో వలస కార్మికులు తెల్లవారుజాము నుంచి రెవెన్యూ కార్యాలయం వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. సిబ్బంది వారి వివరాలు నమోదు చేసి అనుమతి పత్రాలు జారీ చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు కడప నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని, కార్మికులందరికీ ఆర్టీసీ బస్సుల ద్వారా కడప తరలిస్తామని తహసీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి పేర్కొన్నారు.
రాయచోటిలో వలస కార్మికులు పడిగాపులు - బీహార్, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు
జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు లాక్డౌన్ నేపథ్యంలో స్వస్థలాలు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలకు చెందిన కార్మికులను సొంత ప్రాంతాలకు పంపించాలని ఆదేశాలు జారీ చేసినా సకాలంలో రైళ్లు రావటం లేదు. స్థానికంగా వసతి లేకపోవటం ఒక సమస్య అయితే అనుమతి పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల వద్దకు తిరగలేక వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వలస కార్మికులు పడిగాపులు