ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YSR VARDHANTHI: నాన్న స్ఫూర్తే నన్ను నడిపిస్తోంది: సీఎం జగన్‌ - వైఎస్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ నివాళి

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌వద్ద సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, విజయమ్మ, భారతి గురువారం నివాళులర్పించారు. ప్రార్థనల తర్వాత వైఎస్‌ సమాధి, విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇడుపులపాయ ఘాట్‌లో సీఎం జగన్‌, ఆయన చెల్లెలు షర్మిల సుమారు 45 నిమిషాలు పక్కపక్కనే ఉన్నా ఒక్కసారీ మాట్లాడుకోలేదు.

cm jagan nivali
cm jagan nivali

By

Published : Sep 2, 2021, 9:50 AM IST

Updated : Sep 3, 2021, 4:42 AM IST

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌వద్ద సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, విజయమ్మ, భారతి గురువారం నివాళులర్పించారు. ప్రార్థనల తర్వాత వైఎస్‌ సమాధి, విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇడుపులపాయ ఘాట్‌లో సీఎం జగన్‌, ఆయన చెల్లెలు షర్మిల సుమారు 45 నిమిషాలు పక్కపక్కనే ఉన్నా ఒక్కసారీ మాట్లాడుకోలేదు. ఘాట్‌లోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద షర్మిలను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి కలిశారు. తెలంగాణ రాజకీయాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. తర్వాత సీఎం జగన్‌ అతిథి గృహానికి వెళ్లి అల్పాహారం తీసుకుని.. తన భార్య భారతితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో కడప విమానాశ్రయానికి, అక్కడినుంచి అమరావతికి వెళ్లారు. షర్మిల, విజయమ్మ రోడ్డుమార్గంలో కడప విమానాశ్రయానికి, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు.

నాన్న స్ఫూర్తే..నన్ను నడిపిస్తోంది: జగన్‌

తాను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తే ముందుండి నడిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యుడిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మది మదిలోనూ అలాగే నిలిచి ఉన్నాయి’ అని ట్వీట్‌ చేశారు.
బీ ప్రజల సంక్షేమానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితాన్ని అంకితం చేశారని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. వైఎస్‌కు ఆయన నివాళులు అర్పించారు.

ఆయన పాలన ఆదర్శ ప్రాయం: సజ్జల

వైఎస్‌ రాజశేఖరరెడ్డి అందించిన ప్రజారంజక పాలన ఆదర్శ ప్రాయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైఎస్‌ వర్ధంతి కార్యక్రమంలో సజ్జల పాల్గొని మాట్లాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన రెండేళ్లలోనే ప్రజారంజక పాలన అందిస్తున్నారని తెలిపారు. అంతకు ముందు మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు.
*వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్‌ వాదేనని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ పేర్కొన్నారు. వైఎస్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి శైలజానాథ్‌ గురువారం నివాళులర్పించారు.‘వైఎస్‌ పేరును జగన్‌రెడ్డి అధికారం కోసమే వాడుతున్నారు’ అని విమర్శించారు.

నాన్న నన్నెంతో ప్రోత్సహించారు: షర్మిల

‘‘ఒంటరి దానివైనా విజయం సాధించాలని, అవమానాలు ఎదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని.. నన్ను నాన్న ఎంతో ప్రోత్సహించారు. నా వెన్నంటి నిలిచి నన్ను కంటిపాపలా చూసుకొన్నారు’’ అని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన నాన్న రాజశేఖర్‌రెడ్డి గురించి గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘నాకు బాధొస్తే ఆయన కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటోంది’’ అని తన తండ్రితో ఉన్న జ్ఞాపకాలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

ఇదీ చదవండి: వ్యాయామానికి ముందు.. తర్వాత ఇవి తప్పనిసరి!

Last Updated : Sep 3, 2021, 4:42 AM IST

ABOUT THE AUTHOR

...view details