కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో శనివారం ఆత్మహత్య చేసుకున్న సాయిమనోజ్ చిత్రపటానికి ఆర్జీయూకేటి ఛాన్స్లర్ కె.సి. రెడ్డి, సిబ్బంది, తోటి విద్యార్థులు నివాళులు అర్పించారు. సాయి మనోజ్ కుటుంబానికి విశ్వవిద్యాలయం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఛాన్స్లర్ తెలిపారు.
సాయి మనోజ్‌కు ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ నివాళులు - kadapa district latest news
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఆత్మహత్య చేసుకున్న మనోజ్ చిత్రపటానికి ఆర్జీయూకేటీ ఛాన్స్లర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవడం తగదని సూచించారు.

సాయిమనోజ్ చిత్రపటానికి ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ నివాళులు
పరీక్షల్లో ఫెయిల్ అయితే... క్షణికావేశానికి లోనై ఆత్మహత్య చేసుకోవడం సబబుకాదని కేసీ రెడ్డి అన్నారు. ఈ అనాలోచిత చర్య వల్ల విద్యార్థుల కుటుంబం క్షోభకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని కోరారు. విద్యార్థుల వసతి గృహాలలోని పది రూములకు ఒక ఉపాధ్యాయుడిని కో-ఆర్డినేటర్‌గా నియమిస్తామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.