ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హాథ్రస్​ యువతికి నివాళులు అర్పిస్తూ.. కొవ్వొత్తుల ప్రదర్శన - ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్​ యువతికి కడపలో నివాళులు

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్​లో హత్యాచారానికి గురైన యువతికి నివాళులు అర్పిస్తూ.. కడప జిల్లా మైదుకూరులో మాదిగ విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు.

Tribute to hathras incident woman with candles rally at mydakuru Kadapa district
హాథ్రస్​ యువతికి నివాళులు అర్పిస్తూ.. కొవ్వొత్తులతో ప్రదర్శన

By

Published : Oct 5, 2020, 9:52 PM IST

హాథ్రస్​ ఘటనలో యూపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని మాదిగ విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు డిమాండ్​ చేశారు. హత్యాచార‌ ఘటనలో మృతిచెందిన యువతికి నివాళ్లు అర్పిస్తూ.. కడప జిల్లా మైదుకూరులోని నాలుగు రోడ్ల కూడలి నుంచి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించా రు. దారుణ హత్యకు పాల్పడిన మానవ మృగాలను ఎన్​కౌంటర్​ చేయాలంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details