కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆకేపాటి అమర్నాథరెడ్డి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని కాపాడుకుంటే అవే మనల్ని కాపాడతాయని పేర్కొన్నారు. అన్నమయ్య రోటరీ క్లబ్ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆకాంక్షించారు.
పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం - కడప జిల్లా తాజా వార్తలు
పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మాజీఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అన్నమయ్య రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
trees plantation by ex mla in cadpa dst rajampeta