కడప జిల్లా మైదుకూరులో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే ముక్కొండ వద్ద పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో 1500 మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎంపీ అవినాష్‌రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులు సూచించారు. ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే ప్రాంతంలో మొక్కలు నాటటం ద్వారా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడనుందని పేర్కొన్నారు. పట్టాలు పొందిన వారు మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు.
పచ్చతోరణం కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ - latest news of kadapa dst
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీచేసే కడప జిల్లా మైదుకూరు ముక్కొండ వద్ద పచ్చతోరణం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. మొక్కలు పెంపకానికి ఇళ్లపట్టాలు పొందిన లబ్ధిదారులు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.

trees plantaion programme started in kadapa dst by mp and collector