కృష్ణా జిల్లా కోడూరు మండలం మందపాకల గ్రామంలో బలంగా వీస్తున్న ఈదురుగాలులకు చెట్టు కూలి ఇంటిపై పడింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు కడవకల్లు వెంకట సుబ్బారావు ఇంటిపై చెట్టుకూలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలంటూ బాధితులు కోరుతున్నారు.
నివర్ తుపాను ప్రభావం..ఈదురుగాలులకు ఇంటిపై కూలిన చెట్టు - nivar cyclone latest news
కృష్ణా జిల్లా కోడూరు మండలం మందపాకల గ్రామంలో ఇంటిపై చెట్టు కూలింది. నివర్ తుపాను ప్రభావంతో ఈదురుగాలులు బలంగా వీచాయి. ఈ ఘటనలో ఇల్లు ధ్వంసమైంది.

tree fall on house at koduru due to nivar cyclone