వేసవి శిక్షణ కేంద్రం... వినోదాల నిలయం - rural
కడపలోని ఓ వేసవి శిక్షణా కేంద్రంలో సుమారు 130 మంది విద్యార్థులు ఉన్నారు. అంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారే. ఆ చిన్నారులకు వేసవి సెలవులు వృథా కానివ్వకుండా కార్పొరేట్ స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్, ఆంగ్లం నేర్పిస్తున్నారు. కాగితాలు, మట్టితో బొమ్మల తయారీ, నృత్యాలు ఇలా వివిధ రంగాల్లో విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నారు.
శిక్షణా కేంద్రంలో చిన్నారులు
కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడు గ్రామంలో మాయలూరు పార్వతి రామకృష్ణారెడ్డి గ్రామీణాభివృద్ధి సంస్థ... చిన్నారులకు వివిధ రంగాల్లో శిక్షణ కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వేసవి సెలవుల్లో అత్యాధునిక వసతులు, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా కంప్యూటర్ పరిజ్ఞానం, మట్టి, కాగితాలతో బొమ్మలు తయారీ, డ్రాయింగ్, నృత్యాలు ఇలా అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు.