కడప జిల్లా ఎర్రగుట్ల మండలం వైకోడూరు వద్ద రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా ఓ కారు ట్రాక్ పై ఆగిపోయింది. కారు ఆగిన క్షణాల్లోనే గూడ్స్ రైలు ఇంజన్ కారును ఢీ కొట్టింది.
కారును ఢీకొట్టిన రైలు ఇంజన్... ఒకరు మృతి - train accident yerragutla mandal
కడప జిల్లా ఎర్రగుట్ల మండలం వై.కోడూరు వద్ద రైల్వే ట్రాక్ పై ఆగిపోయిన కారును రైలు ఇంజన్ ఢీ కొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.
![కారును ఢీకొట్టిన రైలు ఇంజన్... ఒకరు మృతి train accident y.koduru kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7790140-664-7790140-1593239434109.jpg)
కారును ఢీకొట్టిన రైలు ఇంజన్... ఒకరు మృతి
కారును ఢీకొట్టిన రైలు ఇంజన్... ఒకరు మృతి
ఈ ప్రమాదంలో వై కోడూరుకు చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తి మరణించగా... మరోకరికి గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించంగా అతని పరిస్థితి విషమంగా ఉంది. భారతీ సిమెంట్ లో వాగిన్లను వదిలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.