కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట పర్యాటకులతో కళకళలాడింది. సంక్రాంతి పండుగతో పాటు ఆదివారం కలిసి రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కోటను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులతో నిండిపోయింది.
ఇరుకైనా రోడ్లు కావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కారాగారం, మాధవరాయస్వామి, జుమ్మా మసీదు, రంగనాథస్వామి ఆలయం వద్ద పర్యాటకులు సందడి చేశారు. మరికొంతమంది కోనేరులో దిగి చేపలతో ఆడుకున్నారు. పెన్నా లోయ, జుమ్మా మసీదు తదితర ప్రాంతాల్లో సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు.