కడప జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం రైతులు ఆందోళన చెందుతున్నారు. నాసిరకం విత్తనాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్సలవరం గ్రామ పరిధిలో రైతులు దాదాపు 200 ఎకరాల్లో వివిధ రకాల టమాటా పంట సాగు చేస్తున్నారు. ఎకరాకు దాదాపు రూ.40 వేల నుంచి 60 వేల వరకు పెట్టుబడి పెట్టారు. 60 రోజులకే దిగుబడి రావాల్సి ఉండగా... 90 రోజులవుతున్నా US-1508 రకం టమాటా పంట దిగుబడి రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రకాలు సాగు చేసిన రైతులకు పంట దిగుబడి వస్తుండగా... తాము దిక్కులు చూడాల్సి వస్తుందంటున్నారు. తమ పంటను అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
నాసిరకం విత్తనాలు... విలవిల్లాడుతున్న రైతులు
రోజులు గడిచిపోతున్నా టమాటా పిందెలు రాకపోవడం వల్ల కడప జిల్లా ఉత్సలవరం రైతులు ఆందోళన చెందుతున్నారు.
నాసిరకం విత్తనాలు... విలవిల్లాడుతున్న రైతులు