ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక్క రూపాయికే టిడ్కో గృహాలు కేటాయించాలి: సీపీఐ రామకృష్ణ - సీపీఐ ధర్నా తాజా వార్తలు

ఒక్క రూపాయికే లబ్ధిదారులందరికీ టిడ్కో గృహాలు కేటాయించాలని... విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. గృహాలు కేటాయించడానికి ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని సహించబోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.

tidco houses must be distributed to beneficiaries says cpi ramakrishna
ఒక్క రూపాయికే టిడ్కో గృహాలు కేటాయించాలి: సీపీఐ రామకృష్ణ

By

Published : Dec 11, 2020, 4:50 PM IST

టిడ్కో గృహాల లబ్ధిదారులందరికీ ఒక్క రూపాయికే గృహాలు కేటాయించాలని, అన్ని వసతులు తక్షణమే కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. విజయవాడ దాసరి భవన్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్ర నిర్వహించారు. గృహాలు కేటాయించడానికి ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని సహించబోమని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు... రామకృష్ణ సహా పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details