ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 16, 2020, 11:50 AM IST

ETV Bharat / state

నిర్వహణ కరువై.. నిరుపయోగంగా టిడ్కో గృహాలు

కడప జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించి టిడ్కో గృహాలు నిరుపయోగంగా మారాయి. నిర్మాణం పూర్తై ఏళ్లు గడుస్తున్న లబ్ధిదారులకు కేటాయించకపోవడం నిర్వహణ కరువై.. శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

Tidco homes roads
ఆద్వానంగా మారిన టిడ్కో గృహాలకు వెళ్లే దారి


గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో నివాసాలకు సరైన నిర్వహణ లేక కళావిహీనంగా మారిపోయాయి. కడప శివారులో సరోజినీ నగర్ వద్ద 2000 టిడ్కో నివాసాలను నిర్మించారు. అవి పూర్తై 18 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు ఆ నివాసాలను లబ్ధిదారులకు కేటాయింకపోవడం.. నిర్వహణ కరువై శిథిలావస్థకు చేరుతున్నాయి. ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోవడం... ముఖ్యంగా రోడ్లు, విద్యుత్, మురుగు కాలువల వ్యవస్థ, వీధి దీపాలు నీటి సౌకర్యం లాంటి వసతులు ఏర్పాటు చేయలేదు. దీంతో నివాసాల చుట్టూ ఎత్తైన ముళ్ళపొదలు పెరిగాయి. రోడ్లన్నీ గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని గదుల్లో కిటికీలు దెబ్బతిన్నాయి. నివాసంలోకి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details