కడప జిల్లా మైదుకూరులో 30 వ నెంబరు చౌక దుకాణంపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. డబ్బాలతో తూకాలు వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక మహిళకు సరఫరా చేసిన బియ్యంలో తూకం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 20 కేజీలలో రెండున్నర కేజీలు తక్కువగా ఉండడాన్ని గమనించారు. అదేవిధంగా 2014లో సీలు వేసిన రాళ్లతో తూకాలు వేస్తున్నట్లు గుర్తించిన అధికారులు...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చౌక దుకాణాలపై తూనికలు కొలతల శాఖ దాడులు - కడప జిల్లా
కడప జిల్లా మైదుకూరులో తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. 30వ నెంబరు చౌక ధరల దుకాణంలో తనిఖీలు నిర్వహించి.. తూకంలో తేడాను గమనించారు.
'చౌక దుకాణాల పై తూనికల కొలతల శాఖ దాడులు'
ఇవి చదవండి...రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం