శ్రీశైలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. వరుసగా మూడోరోజు శ్రీశైలంలో భారీ వర్షం పడుతోంది. చిత్తూరు, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలో పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉంది. చిత్తూరు, ప్రకాశం జిల్లా రాచర్ల, ఉలవపాడు, కడప జిల్లా రాజంపేట, కోడూరులో వర్షం పడవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు, చిట్టమూరు, కోట, వెంకటాచలం, మనుబోలు, చేజర్ల, తడ, కోవూరు, గూడూరు, చిల్లకూరు మండలాల్లో జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఆయాచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని... స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
పిడుగులు పడే ప్రమాదం ఉంది... జాగ్రత్త - రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు
రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని... రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కడప జిల్లాలో రాగల 3 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
![పిడుగులు పడే ప్రమాదం ఉంది... జాగ్రత్త thunder effect to andhra pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6722626-273-6722626-1586419332596.jpg)
పిడుగులు పడే ప్రమాదం ఉంది... జాగ్రత్త