ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి ఉపఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌ హాస్యాస్పదం:తులసిరెడ్డి - తులసిరెడ్డి తాజా వార్తలు

తిరుపతి ఉపఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌ హాస్యాస్పదమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యనించారు. ఎన్నికల్లో వైకాపా, తెదేపా ఎవరు గెలిచినా ప్రయోజనం శూన్యమన్నారు.

Thulasireddy on  Minister Peddireddy's challenge
తిరుపతి ఉపఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌ హాస్యాస్పదం

By

Published : Apr 12, 2021, 4:34 PM IST

తిరుపతి ఉపఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌ హాస్యాస్పదం

తిరుపతి ఉప ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌ హాస్యాస్పదంగా ఉందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. తిరుపతిలో వైకాపా, తెలుగుదేశం ఎవరు గెలిచినా ప్రయోజనం శూన్యమని చెప్పారు. విభజన హామీలు అమలు చేసే శక్తిలేని ఈ పార్టీలకు ఎందుకు ఓటేయాలో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీలో బీ అంటే బాబు.., జే అంటే జగన్.., పీ అంటే పవన్ అని అభివర్ణించిన తులసిరెడ్డి..దుష్టత్రయాన్ని ఓడించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details