కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి ప్రభుత్వం నిధులు తగ్గించటం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. తెలుగు భాష కోసం పనిచేసి... ఆయన జ్ఞాపకాలతో ఏర్పాటు చేసిన సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి ప్రభుత్వం వెంటనే నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం గ్రంథాలయానికి 30 లక్షల వార్షిక బడ్జెట్ కేటాయించేవారని గుర్తుచేశారు. వైకాపా ప్రభుత్వం మాత్రం వార్షిక బడ్జెట్ 10 లక్షలకు తగ్గించటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రకటనల ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం... బ్రౌన్ గ్రంథాలయానికి బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు.
సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి నిధులు తగ్గించటం దుర్మార్గం: తులసిరెడ్డి - సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి నిధులు న్యూస్
కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి నిధులు తగ్గించటం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. గ్రంథాలయానికి గతంలో మాదిరిగానే 30 లక్షల వార్షిక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు.
![సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి నిధులు తగ్గించటం దుర్మార్గం: తులసిరెడ్డి సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి నిధులు తగ్గించటం దుర్మార్గమైన చర్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9629592-448-9629592-1606059260639.jpg)
సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి నిధులు తగ్గించటం దుర్మార్గమైన చర్య