రైతులకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ పథకం కింద ఎనిమిది వేల కోట్లు ఎగరగొట్టి రైతుల నోట్లో దుమ్ము కొట్టిందని విమర్శించారు. రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అందులో 5000 రూపాయలు కోత కోసిందని పేర్కొన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి ప్రభుత్వం కేటాయింపులు తగ్గించిందని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం జీవో 22 జారీ చేయడం ... రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమేనని తులసిరెడ్డి ఆరోపించారు. భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 22 ప్రతులను భోగి మంటల్లో వేసి తులసిరెడ్డి దహనం చేశారు.
వైకాపా.. రైతు వ్యతిరేక ప్రభుత్వం: తులసిరెడ్డి - వైసీపీపై తులసిరెడ్డి కామెంట్స్
వైకాపా ప్రభుత్వం రైతుల చేతులకు బేడీలు వేసే స్థాయికి చేరిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి విమర్శించారు. అనేక రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు.
thulasireddy comments on ysrcp govt