ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ మూడు కారణాలతోనే సీఎం తిరుపతి పర్యటన రద్దు' - Thulasireddy comments on cm tirupathi tour cancelation

గతంలో 'కావాలి జగన్ - రావాలి జగన్' అన్న ప్రజలే ఇప్పుడు 'జగన్ రావద్దు - జగన్ పోవాలి' అని అంటున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు చేసుకోవటానికి మూడు కారణాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Thulasireddy comments on cm tirupathi tour cancelation
ఆ మూడు కారణాలతోనే సీఎం తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు

By

Published : Apr 11, 2021, 8:27 PM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ మాటల్లో నిజాయితీ కనిపించటం లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రుల పర్యటనలకు, ప్రచారాలకు అడ్డురాని కరోనా...ముఖ్యమంత్రి ప్రచారానికి మాత్రమే అడ్డు వచ్చిందా ? అని ప్రశ్నించారు. ప్రచార సభ రద్దు చేసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉండవచ్చని తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు.

1. ఎన్నికల సభ ఫెయిల్ అవుతుందేమోనని..సభకు ప్రజలు రారనే భయమైనా అయ్యిండాలి.

2. సభలో మాట్లాడేందుకు సరకు లేక రద్దు చేసుకుని ఉండాలి.

3. ఎలాగూ ఓటమి తప్పదని రద్దు చేసుకుని ఉండాలి.

మునుపటిలా ప్రజలు లేరని.. గతంలో 'కావాలి జగన్ - రావాలి జగన్' అన్న ప్రజలే ఇప్పుడు 'జగన్ రావద్దు - జగన్ పోవాలి' అని అంటున్నారని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదీచదవండి

'రాజీనామా డ్రామాతో వైకాపా అసలు రంగు బయటపడింది'

ABOUT THE AUTHOR

...view details