తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక రవాణను అడ్డుకున్న దళిత యువకున్ని పోలీసులు చితకబాది, శిరోముండనం చేయటం అమానవీయ చర్య అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. కొంతమంది పోలీసులు ప్రభుత్వానికి కీలుబొమ్మలుగా మారారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారని తులసిరెడ్డి కడపలో గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.