ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

103 చీనీ చెట్లను నరికేసిన దుండగులు - chini crop in kadapa

కడప జిల్లా లోమడ గ్రామానికి చెందిన సతీష్​రెడ్డి అనే రైతు పొలంలో ఉన్న చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా డాగ్​స్క్వాడ్​తో విచారణ చేపట్టారు.

కడపలో చీనీ చెట్లను నరికిన గుర్తు తెలియని వ్యక్తులు

By

Published : Nov 4, 2019, 5:56 PM IST

కడపలో చీనీ చెట్లను నరికిన గుర్తు తెలియని వ్యక్తులు

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం లోమడ గ్రామానికి చెందిన సతీష్​​రెడ్డి అనే రైతు పొలంలో చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. సతీష్​రెడ్డి తన 5ఎకరాల పొలంలో చీనీ మొక్కలు సాగు చేసుకుంటుండగా... గుర్తు తెలియని వ్యక్తులు 103 చీనీ చెట్లను నరికివేశారు. తనను ఇబ్బంది పెట్టేందుకే చెట్లను నరికివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details