ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బద్వేల్ భూవివాదం, హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ - బద్వేల్ భూవివాదం హత్యకేసులో ముగ్గురి అరెస్ట్

కడప జిల్లా బద్వేలు మండలం అగ్రహారంలో... భూవివాదానికి సంబంధించి జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను బద్వేల్ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు గురైన పుల్లయ్య కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

three victims are arrested in badwel land issue murder case in kadapa district
బద్వేల్ భూవివాదం హత్యకేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

By

Published : Aug 13, 2020, 6:23 PM IST

కడప జిల్లా బద్వేల్​లోని అగ్రహారంలో భూవివాదంలో పుల్లయ్య అనే వ్యక్తిని ఇటీవల ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ కేసులో నిందితులైన కొండబాబు, శ్రీనివాసులుతో పాటు మరొకరిని మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్ గోపవరం చెక్​పోస్ట్ వద్ద అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

హతుడు పుల్లయ్య మేనత్తకు పిల్లలు లేరు. బద్వేల్ బైపాస్ రోడ్​లో ఆమెకు 30 సెంట్లు స్థలం ఉంది. పుల్లయ్యతో పాటుగా.. మేనల్లుళ్లైన శ్రీనివాసులు, కొండబాబు... చెరో 15 సెంట్లు మేనత్త నుంచి రిజిస్టర్ చేయించుకున్నారు. తన వాటాకు రావలసిన స్థలాన్ని ఇవ్వాలని పుల్లయ్య వారిని నిలదీశాడు. కొండబాబు, శ్రీనివాసులు.. మరో వ్యక్తితో కలిసి పుల్లయ్యను కర్రలతో కొట్టి హత్య చేశారు.

మృతుడి కుమారుడు నితీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:

దళితులకు అన్యాయం జరుగుతోందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు: హోంమంత్రి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details