కడపకు కేటాయించిన మూడు సంజీవని బస్సులు జిల్లాకు చేరుకున్నాయి. కరోనా వైరస్ పరీక్షలు చేయడానికి ఈ బస్సులు అవసరమైన ప్రాంతాలకు వెళ్తాయని అధికారులు తెలిపారు. అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వీటిని శనివారం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
కడపకు చేరుకున్న సంజీవని బస్సులు - kadapa news today
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆర్టీసీ ఇంద్ర బస్సు సర్వీసులను సంజీవని పేరిట పరీక్షలకు సిద్ధం చేశారు. కడప జిల్లాకు మూడు సంజీవని బస్సులను కేటాయించారు.
కడపకు చేరుకున్న సంజీవిని బస్సులు