కడప జిల్లా దువ్వూరు మండలం కృష్ణంపల్లె వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. కృష్ణంపల్లిలో జరుగుతున్న ఉరుసు మహోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
కృష్ణంపల్లె సమీప గ్రామం కానగూడూరుకు చెందిన రామయ్యగిరి అక్కడికక్కడే మృతి చెందగా.. కమలాపురానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దువ్వూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పులివెందులలో ట్రాక్టర్ బోల్తా