ప్రొద్దుటూరులో దారుణం - ప్రొద్దుటూరులో ముగ్గురు హత్య అప్డేట్స్
09:00 April 26
తల్లి, చెల్లి, తమ్ముడిని చంపిన కరీముల్లా
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. సొంత కుమారుడే తల్లితో పాటు చెల్లి, తమ్ముడిని చంపేశాడు. తన వివాదం విషయంలో కుటుంబ సభ్యులు సహకరించడం లేదన్న కారణంతో ముగ్గురిని అతి కిరాతకంగా హతమార్చాడు. ఆపై పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని హైదర్‌ఖాన్ వీధిలో ఈ ఘటన జరిగింది.
ఇంటి పెద్ద కుమారుడు కరీముల్లాకు తన భార్యతో వివాదం ఉంది. ఈ విషయంలో తల్లి, చెల్లి, తమ్ముడు సహకరించాలంటూ కొద్ది రోజులుగా ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున తల్లి ఇంటికి వచ్చిన కరీముల్లా.. నిద్రిస్తున్న తల్లి గుల్జార్ బేగం, తమ్ముడు మహమ్మద్ రఫీ, చెల్లెలు కరీమున్నీసాలను రోకలి బండతో దారుణంగా హతమార్చాడు. అనంతరం తెల్లవారుజామున కరీముల్లా నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. ఇద్దరు కొవిడ్ రోగులు మృతి