కడప జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ మరో 3 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల ఎర్రగుంట్లలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంట్లోనే.. మరో ముగ్గురికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 58 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 28 మంది డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో ఎక్కువగా కరోనా కేసులున్న ప్రొద్దుటూరుకు సమీపంలో ఉండడం వల్లే.. ఎర్రగుంట్లకూ వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
కరోనా బాధితుడి ఇంట్లో.. మరో ముగ్గురికి పాజిటివ్!
కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. కడప జిల్లాలో కరోనా పాజివ్ వచ్చిన వ్యక్తి ఇంట్లోని మరో ముగ్గురికి వైరస్ సంక్రమించినట్లు అధికారులు తెలిపారు.
three more corona positive cases find in kadapa