భాజపా రాష్ట్ర కార్యవర్గంలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు చోటు కల్పిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన విడుదల చేశారు. కడప జిల్లాలో ఒకేసారి ముగ్గురికి చోటు దక్కడంతో భాజపా శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎంపికయ్యారు. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి చెందిన శశి భూషణ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా రాజంపేటకు చెందిన రమేష్ నాయుడుకి స్థానం దక్కింది.
భాజపా రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నుంచి ముగ్గురికి చోటు - ఏపీ భాజపా రాష్ట్ర కమిటీ వార్తలు
భాజపా రాష్ట్ర కార్యవర్గంలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు చోటు దక్కింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన విడుదల చేశారు. జిల్లా నుంచి ముగ్గురికి స్థానం కల్పించటంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
![భాజపా రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నుంచి ముగ్గురికి చోటు bjp state committee andhra pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8787860-956-8787860-1599999399258.jpg)
bjp state committee andhra pradesh