కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో మట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.2,05,000 నగదు, ఆరు చరవాణులు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు . మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్ ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మట్కా స్థావరాలపై దాడులు.. ముగ్గురు అరెస్ట్ - కడప జిల్లా తాజా వార్తలు
కడప జిల్లాలో మట్కా స్థావరాలపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. రూ. 2,05,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్ ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మట్కా స్థావరాలపై దాడులు.. ముగ్గురు అరెస్ట్