ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

land disputes: అన్నదమ్ముల మధ్య భూ వివాదం.. తుపాకీతో బెదిరింపులు - land disputes between brothers in peddakampalli

అన్నదమ్ముల మధ్య చెలరేగిన భూ వివాదం(land disputes between brothers).. నాటు తుపాకీతో బెదిరింపులకు దారితీసింది(threats with a gun). ఈ ఘటన కడప జిల్లా పెద్దకారంపల్లిలో నెలకొంది.

అన్నదమ్ముల మధ్య భూ వివాదం
అన్నదమ్ముల మధ్య భూ వివాదం

By

Published : Oct 29, 2021, 10:04 PM IST

కడప జిల్లా రాజంపేట మండలం పెద్దకారంపల్లిలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన భూ వివాదం.. నాటు తుపాకీ బెదిరింపులకు దారితీసింది(threats with a gun). పెద్దకారంపల్లికి చెందిన సుబ్బారెడ్డి, తేజారెడ్డి, ఆశ్వర్ధమరెడ్డి.. చిన్నాన్న, పెద్దనాన్న పిల్లలు. వీరిమధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. కాగా.. రెండు రోజులుగా ఇరు కుంటుంబాల మధ్య వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయినా.. అన్నదమ్ములు భూ వివాదం(land disputes between brothers) చల్లారలేదు. ఈ క్రమంలోనే.. సుబ్బారెడ్డి నాటుతుపాకితో సోదరులను బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సమాచారం అందిందని, విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని మన్నూరు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details