ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరువర్గాల మధ్య ఘర్షణ... 13 మందికి గాయాలు - kadapa district latest news

కడప జిల్లా మరియాపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భజన కార్యక్రమంలో జరిగిన ఈ వివాదంలో కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో గాయాలపాలైన 13 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

thirteen people injured in  two groups quarreling at mariyapuram kadapa district
ఇరువర్గాల మధ్య ఘర్షణ... పదమూడు మందికి గాయాలు

By

Published : Jan 2, 2021, 4:20 PM IST

ఇరువర్గాల మధ్య ఘర్షణ... పదమూడు మందికి గాయాలు

భజన కార్యక్రమం దగ్గర తలెత్తిన చిన్నపాటి వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. కడపలోని మరియాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 13 మంది గాయపడగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక మహిళలు కొత్త ఏడాది సందర్భంగా శుక్రవారం భజన కార్యక్రమం ఏర్పాటు చేయగా... కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఘర్షణ తలెత్తకుండా పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. అయితే... ఈ ఉదయం మరోసారి పరస్పరం తలపడిన రెండు వర్గాలు... కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. పలువురికి తలపై గాయాలు కావడం సహా, కత్తిపోట్లకు గురయ్యారు. గాయపడిన వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details