కడప జిల్లా ప్రొద్దుటూరులో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి మైదుకూరు రోడ్డులోని రెండు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. షెట్టర్లను కర్ర సహాయంతో తెరచి దుకాణాల్లోకి వెళ్లి నగదు అపహరించారు. ఒక దుకాణంలో లక్ష రూపాయలు దొంగలిచిన దుండగులు.. మరో దుకాణంలో 45 వేల రూపాయలు దోచుకున్నారు. ఆదివారం దుకాణాలు తెరిచేందుకు వచ్చిన యజమానులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు చోరీకి పాల్పడి దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.
దుకాణాల్లో చోరీ.. లక్షా 45 వేల నగదు అపరణ - Theft in Proddaturu
కడప జిల్లా ప్రొద్దుటూరులో దొంగలు హల్చల్ చేశారు. రెండో దుకాణాల్లో చొరబడి.. లక్షా 45 వేల రూపాయలను అపహరించుకుపోయారు.
దుకాణాల్లో చోరీ