Theft in Kadapa city: కడప నగరంలో దుండగులు తాళం వేసిన ఇల్లును టార్గెట్ చేసి చొరీకి పాల్పడ్డారు. నగరంలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి నగర్ భవానీ అపార్ట్ మెంట్లోనీ శ్రీనివాసులు ఇంట్లో దొంగతనం జరిగింది. అర్థరాత్రి గోడ దూకి.. 201 అపార్టుమెంటులో వెళ్లి, తాళం పగులు గొట్టి, బెడ్ రూంలో ఉన్న వస్తువులను చిందర వందర చేశారు. బీరువాలో దాచిన సుమారు 60 తులాల బంగారం, నగదును దుండగులు ఎత్తు కెళ్లారు.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేలోపే - AP Thefts
Theft in Kadapa city: తాళం వేసి ఉన్న ఇంటిలో చొరబడి దుండగులు బంగారం, నగదు చోరీ చేసిన ఘటన కడప నగరంలో చోటుచేసుకుంది. నగరంలో బందువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో దొంగతనం జరిగిందని బాధితులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
![తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేలోపే Theft in Kadapa city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16878769-426-16878769-1667989892748.jpg)
కడప నగరంలో చోరీ
ఉదయం తిరిగి ఇంటికి వచ్చిన సమయంలో చోరీ అయినట్లు తెలుసుకొని, పోలీసులకు పిర్యాదు చేశారు. చోరీ చేసిన దుండగులు వచ్చిన దారినే వెళ్లిపోయినట్లు ఎదురుగా ఉన్న సీసీ పుటేజి ద్వారా తెలిసిందని బాధితులు చెబుతున్నారు. కడపలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి, ఒక రాత్రి లేకపోయే సరికి ఈ చోరీ జరిగిందని బాధితులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి: