ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు - కడప జిల్లా నేర వార్తలు

లాక్​డౌన్​ను ఆసరా చేసుకొని కడప నగరంలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి బంగారు ఆభరణాలు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Thief arrested in kadapa district
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

By

Published : May 26, 2020, 5:16 PM IST

కడప కు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి నగరంలో ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఆరుబయట నిద్రిస్తున్న వారి నుంచి తాళాలు తీసుకుని దొంగతనాలు చేస్తాడని పోలీసులు పేర్కొన్నారు. ఇతనిపై గతంలో కేసులు ఉన్నాయన్న డీఎస్పీ.... జైలుకెళ్లొచ్చినా మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడని తెలిపారు. నిందితుడి నుంచి 5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details