శివాలయంలో పంచ లోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయంలో అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి 4 పంచలోహ విగ్రహాలను దొంగలించాడు. వాటిని విక్రయించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని తనిఖీ చేశారు. అతని వద్ద నుంచి నాలుగు పంచలోహ విగ్రహాలను స్వాధీనపర్చుకున్నారు. ఆలయాల్లో ఇటీవల చోరీలు జరుగుతున్నందున అన్ని ఆలయాలపై నిఘా ఉంచామని డీఎస్పీ సూర్యనారాయణ పేర్కొన్నారు.
వల్లూరులో పంచలోహ విగ్రహాలు చోరీ చేసిన దొంగ అరెస్ట్ - వల్లూరు తాజా వార్తలు
కడప జిల్లా వల్లూరు శివాలయంలోని పంచలోహ విగ్రహాలను చోరీ చేసిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 4 విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.

'వల్లూరులో పంచలోహ విగ్రహాలను చోరీ చేసిన దొంగ అరెస్ట్'