కడప జిల్లా బద్వేలులో.. వెండి అభరణాలను దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 19వ తేదీన కడప నుంచి బద్వేలు ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లిన అలీ హుస్సేన్.. నెల్లూరు బస్సు ఎక్కాడు. ముందు సీట్లో ఉన్న వ్యక్తి నుంచి వెండి ఆభరణాలు ఉన్న సంచిని తీసుకొని బస్సు దిగి వెళ్లాడు.
వాటిని విక్రయించడానికి నెల్లూరు పట్టణానికి తీసుకెళ్తుండగా... పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అతని దగ్గర సంచి కనబడగా సీఐ రమేష్ వివరాలు ఆరా తీశారు. వెండి ఆభరణాలు ఎవరివో తెలీదని... అవి లక్ష రూపాయలు ఉంటాయని చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని సీఐ వెల్లడించారు.