కడప జిల్లాలో కొర్రపాడు, రాజుపాలెం, చిన్నశెట్టి పల్లె, అరకటవేముల, పొట్టిపాడు, పర్లపాడు, పగిడాల గ్రామాల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు రహదారుల వెంట ఉండే పచ్చని అందాలకు ముగ్ధులవుతున్నారు. ఏ సమయంలో వెళ్లినా చల్లటి వాతావరణం ఉండటంతో సంతోషంగా ప్రయాణిస్తున్నారు. రాజుపాలెం మండలమంతా 44 వేల ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారు. శనగ, పత్తి, జొన్న, కంది పంటలు పండిస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో రహదారి చుట్టూ కనుచూపుమేర పచ్చదనం పరుచుకోవటంతో రైతులు, అటువైపు వెళ్లే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రహదారి చుట్టూ... ప్రకృతి పరవళ్లు - They are impressed by the green beauty along the roads.
ఆ రహదారి గుండా ప్రయాణిస్తే ఎంత దూరమైన అలా సాగిపోవాలనిపిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా ప్రకృతి పరిమళిస్తోంది. మనసుకు ఆహ్లాదం కలుగుతోంది. ఆ దారిలో వెళితే పచ్చని పంటలు కనువిందు చేస్తాయి. కోనసీమను తలపించేలా కవ్విస్తాయి. అయితే ఈ రహదారి చూడాలంటే కడపజిల్లా రాజుపాలెం మండలం వెళ్లాల్సిందే.
రహదారి చుట్టూ....ప్రకృతి పరవళ్లు